Share this book with your friends

Car driving paṭashalala suchana pustakamu / కార్ డ్రైవింగ్ పాఠశాల సూచన పుస్తకము కార్ డ్రైవర్లకు ముఖ్యమైన పుస్తకం / Kar draivarlaku mukhyamaina pustakam

Author Name: Naresh Raghvan, Malcolm Wolfe | Format: Paperback | Genre : Educational & Professional | Other Details

మంచి డ్రైవర్‌గా ఎవరూ పుట్టరు. మంచి డ్రైవింగ్కు 'డ్రైవర్ విద్య', శిక్షణ, అభ్యాసం మరియు ఇతరుల పట్ల మంచి వైఖరి అవసరం. కానీ, ప్రస్తుతం భారతదేశంలో సమగ్ర కార్ డ్రైవర్ విద్య పుస్తకం లేదు. డ్రైవింగ్ నిబంధనలు వేర్వేరు ప్రభుత్వ నియమాలు మరియు నిబంధనలలో అందించబడ్డాయి మరియు సాంకేతిక పదాలలో వ్రాయబడ్డాయి, ఇది సామాన్యులకు అర్థం చేసుకోవడం కష్టం. ఈ పుస్తకం చట్టాన్ని గౌరవించే మరియు సురక్షితమైన డ్రైవర్ కావడానికి అవసరమైన అన్ని నియమాలను సరళీకృతం చేసింది మరయు ఎవరైనా ప్రావీణ్యం పొందటానికి సరళమైన భాషలో వ్రాయబడింది. 100 కి పైగా రంగు ఫోటోలతో చదవడం సులభం. మీరు ఇప్పటికే కారు డ్రైవర్ అయినా, లేదా నేర్చుకోవాలనుకుంటున్నా, ఈ 100 పేజీలను చదివి ప్రపంచ స్థాయి డ్రైవర్ కావచ్చు!

Read More...
Paperback
Paperback 360

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

నరేష్ రాఘవన్ & మాల్కం వోల్ఫ్

Naresh Profile

నరేష్ రాఘవన్ మెకానికల్ ఇంజనీర్ మరియు MBA. అతను 8 దేశాలలో 34 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉన్నారు. అతని ఇంజనీరింగ్ డిగ్రీ మరియు తన యవ్వనంలో హైదరాబాద్లో కార్ గ్యారేజీని నడిపిన అనుభవంతో కలిపి డ్రైవింగ్ యొక్క మెలుకువలు బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడింది. అతను భారతదేశం, అమెరికా మరియు దుబాయ్ నుండి డ్రైవింగ్ లైసెన్సులను కలిగి ఉన్నారు మరియు రహదారి భద్రతపై లోతైన జ్ఞానం కలిగి ఉన్నారు. అతను అనేక భారతీయ రాష్ట్రాల్లో విస్తృతంగా నడిపించారు మరియు భారత ట్రాఫిక్ పరిస్థితుల యొక్క వాస్తవికతను అర్థం చేసుకున్నారు.

నరేష్, కారు మరియు మోటారుసైకిల్ డ్రైవింగ్ భద్రతలో అమెరికా నుండి అనేక అధునాతన శిక్షణ పొందారు‘డ్రైవర్ విద్య’ ద్వారా మనము భారతదేశంలో రహదారి భద్రతను మేరుగు పరుచవచ్చనీ నరేష్ అభిప్రాయపడ్డారు మరియు డ్రైవర్లకు సహాయపడటానికి అనేక డ్రైవింగ్ పుస్తకాలను వ్రాశారు. నరేష్ హైదరాబాద్లో నివసిస్తున్నారు.

Malcolm Profile

స్క్వాడ్రన్ లీడర్ మాల్కం వోల్ఫ్ (రిటైర్డ్) జుబ్బల్పూర్ ఇండియాలో జన్మించారు. అతను 1978 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి పట్టభద్రుడయ్యారు మరియు 1980 లో భారత వైమానిక దళంలో పైలట్‌గా నియమించబడ్డారు. 3000 గంటలకు పైగా ప్రయాణించిన తరువాత, అతను 1993 లో IAF నుండి రిటైర్ అయ్యారు మరియు తాత్కాలికంగా UK కి వెళ్ళారు.

UK లో అతను లండన్లోని పోలీస్ ఫోర్స్‌లో పనిచేశారు, అక్కడ ట్రాఫిక్ చట్టాలు మరియు అమలుపై నైపుణ్యథ పొందారు. అతను యూరప్, దుబాయ్, ఆస్ట్రేలియా మరియు అమెరికాలో అనేక వాహనాలు నడిపారు మరియు వివిధ ట్రాఫిక్ వ్యవస్థల యొక్క మంచి అనుభవం కలిగి ఉన్నారు. 2007 లో, అతను ఒక డ్రైవర్ హ్యాండ్‌బుక్‌ను ప్రచురించారు.

భారతదేశంలో ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరిచేందుకు 2014 లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అతను ఇప్పుడు డ్రైవర్లకు ఉన్నత ప్రమాణాలకు శిక్షణ ఇవ్వడానికి డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నారు. సురక్షితంగా, క్రమశిక్షణతో డ్రైవింగ్ నేర్పించడం ద్వారా ప్రాణాలను రక్షించడమే అతని లక్ష్యం.

Read More...

Achievements

+5 more
View All