Share this book with your friends

Ganitha Saakunthalam / గణిత శాకుంతలం

Author Name: S. Rajyalakshmi | Format: Paperback | Genre : Biographies & Autobiographies | Other Details

ప్రతిభకి అర్ధమే తెలియని పసితనంలోనే అసమాన గణిత ప్రతిభ కనపరిచి ప్రపంచాన్నే మంత్రముగ్ధులని చేస్తూ, అయిదేళ్లకే కుటుంబభారం కోసం సంపాదన మొదలెట్టిన  ఒక  చిన్నారి శకుంతలా దేవి కధ ఇది.  ఎంతో మేధస్సు ఉన్న తను  పెరుగుతున్న కొద్దీ ఒక విలక్షణ మనస్తత్వాన్ని సంతరించుకుంది.  తన జీవన ప్రయాణంలో ఎదురైన ఎన్నో సవాళ్లని  తన ముక్కుసూటితనంతో ఎదుర్కొని  తన కీర్తిని కూడా చివరి క్షణందాకా  నిలబెట్టుకుంది. ఆ సాధన వెనక చాలా మానసిక సంఘర్షణ ఉంది.  దాన్ని అర్దం చేసుకునే చిన్న ప్రయత్నమే ఇది.  గణితం లాంటి మేధాపరమైన విషయాలు మహిళలకు అర్దం కావన్నది  పురుషాధిక్యపు  లోకాభిప్రాయం.   అది నిజం కాదని నిరూపిస్తూ శకుంతలాదేవి లాగే,  తమ జీవితాన్ని గణితశాస్త్రపు అభివృద్ధి కోసం అంకితం చేసిన ఇంకో ఇద్దరు మహిళా గణిత మేధావులైన  టి.ఏ. సరస్వతి అమ్మ, పరిమళా రామన్ ల  ప్రతిభకిచ్చిన అక్షర నీరాజనం  కూడా ఉంది ఈ పుస్తకంలో.  పురుషులని దాటి  గణితచరిత్రలో వీరు ఒక సుస్థిరస్థానం సంపాదించుకోడం వెనక ఎంతో కృషి, పట్టుదలా ఉన్నాయి.  తర్వాతి కాలంలో చాలామంది అరుదైన మేధావులు ఈ రంగంలో రాణించినా, ప్రధమ స్థానం ఎపుడూ ప్రధమ స్థానమే.    అందుకే, విద్య ఒకరి సొత్తు కాదు, అది లోకమంతా వ్యాపించే సరస్వతీ పరిమళం,  ప్రాణవాయువు లాంటి వాసంతసమీర శాకుంతలం !! 

Read More...
Paperback
Paperback 189

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ఎస్. రాజ్యలక్ష్మి

ఎస్. రాజ్యలక్ష్మి  సెంట్రల్ గవర్నమెంట్ జీ ఎస్ టి డిపార్ట్మెంట్ లో గుంటూరు లో గజెటెడ్ సూపరింటెండెంట్ గా పని చేసి  ఇటీవల స్వచ్చంద పదవీ విరమణ చేశారు.  సగం జీవితం వృత్తికే అంకితం చేశాక,  ఇక మిగతా జీవితం తనకిష్టమైన ప్రవృత్తి  అయిన రచనకీ, మనస్తత్వ శాస్త్రశోధనకీ కేటాయిస్తున్నారు.  గుంటూరులో ప్రస్తుతం కౌన్సెల్లింగ్  సైకాలజిస్ట్ గా ఉన్నారు.  ఇదివరలో ఆమె రాసిన కధలు, కవితలు, పుస్తక సమీక్షలు,  మహిళల సమస్యల మీద వ్యాసాలు   ఆంధ్రజ్యోతి వార పత్రిక లో, భూమిక మాస పత్రిక లో,  వివిధ వార్తాపత్రికలలో ప్రచురితమయ్యాయి.  పుస్తకరూపంగా ఇది తన తొలి ప్రయత్నం.

 

Read More...

Achievements