Share this book with your friends

Sree Raama Ramaamrutham / శ్రీ రామ రమామృతం

Author Name: Ram V Sarma | Format: Paperback | Genre : Poetry | Other Details

శ్రీరామచంద్రుని సౌందర్యము, సౌశీల్యము, శూరత్వము, అంతులేని దయాగుణములు రంగరించిన తేజస్సు అనే అమృతాన్ని అందరికీ పంచాలనే తలపుతో కూర్చిన పద్యకావ్యం "శ్రీరామ రమామృతం". మానవ జన్మ నెత్తి ఈతిబాధలనెదుర్కొనుట వలననేమే, "రామా" అని శరణువేడగానే ఆదుకొని, ఈ సంసార సముద్రాన్ని దాటిస్తాడు, ఆ తారక రాముడు. ఈ కావ్యంలో దండకము మొదలగు శ్రీరామ ప్రార్ధనలతోబాటు రామాయణ గాధను సంక్షిప్తముగా శతకరూపంలో, మానవుల ఆవేదనను నైవేద్య రూపంలో అర్పించబడినది.

Read More...
Paperback
Paperback 195

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

వల్లభజ్యోస్యుల వేంకట రామప్రసాదు

తల్లి, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కొంగుపట్టుకొని నడకతో బాటు, ఆవిడ శ్రద్ధగా అనుసరించిన ధర్మాచరణ, సాత్విక సత్ప్రవర్తన, సహానుభూతి కొద్దిగా నేర్చుకున్న వేంకట రాంప్రసాద్, తండ్రి, గొప్ప ఆంజనేయోపాసకుడు, తీక్షణ జ్యోతిష శాస్త్ర విద్వాంసుడు, లోకవ్యవహారదక్షుడు ఐన శ్రీ సుబ్రహ్మణ్య శర్మగారు చిన్న చిన్న కధలుగా చెప్పగా రామయణాది ఇతిహాసముల సారాంశముతో బాటు, దైవభక్తి, సంగీతసాహిత్యాభిమానము, జీవన సిద్ధాంతములను అవగతం చేసుకున్నారు.

సామాజిక  పరమపదసోపానపటములో నిచ్చెనలెక్కే ప్రయత్నంలో జీవిత పరమాశయం గూర్చి పర్యాలోచింౘు సమయంలో తన అచింతిత చింతనని “లుప్తాత్మ” అన్న కలంపేరుతో బ్లాగు రూపంలో వ్యక్తంచేసారు రాంప్రసాద్. తల్లితండ్రులు అలవరిచిన వాటికి, శ్రీ ఉప్పలూరి సుబ్బరాయశర్మ గారు నిండుసభలో "త్వరలో శతకం రాస్తాడు" అని ప్రకటించి విసిరిన సవాలు ఆజ్యంపోయగా ఆవిర్భవించినదే ఈ "శ్రీరామ రమామృతం".

Read More...

Achievements

+3 more
View All