ఐదుకి మూడు కలిపితే పదకొండా? అదెలా అంటే ఆ జవాబు అన్నదమ్ముల మధ్యన లెక్కల్లో అంతే అని నిర్ధారించే కథ – “5 + 3 = 11”
ఓ సాధారణ హోమియోపతి డాక్టరు బ్యాంకు లాకర్లో ఏమి దాచాడో తెలియాలంటే చదవండి – “Placebo” కథ!
జస్ట్ చిన్న గిన్నెడు టమాటా పచ్చడి ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ ని తన వశం చేసుకుంది! అదే “పచ్చడి-పచ్చడి” కథ!
నలభై ఏళ్ళు కాశీలో ఉన్న స్వామీజీ వృద్ధాప్యంలో తన ఊరు వైజాగ్ కి తిరిగి వచ్చాడు. అతనికి ఇప్పుడున్న బెంగ ఒక్కటే! అదేమిటో “ఆనవాలు” కథలో ఉంది.
అబద్ధం చెప్పి హోటల్ కి వెళ్ళి ఉల్లి దోశ తిన్న రిటైర్డ్ భర్తని భార్యకి పట్టిచ్చిన సంఘటనే “ఉల్లిదోశ” కథ!
ఐస్ క్రీం తోపుడు బండి నడిపే వాడి దయనీయమైన ప్రేమకథ – “అట్టిఫిషల్ ఇంజలిటెన్స్”
శీర్షాసనం వేస్తే మగాళ్లకు ఇంత మంచి లాభం ఉందా? ఔరా! అనిపించే గమ్మత్తైన కథ – “శీర్షాసనం”
గోవా సముద్ర తీరాన పూసల దండలు అమ్ముకునే ఆమె దగ్గర ఓ బ్రిటిష్ యాత్రికుడు గవ్వల దండ కొన్నాడు. బేరం చేసి వందకి కొన్నాడు. అయితే, లండన్ వెళ్లిపోతూ, ఎందుకు తతిమ్మా వంద కూడా ఆమెకి ఇచ్చేశాడు? అదే “పూసల బేరం” కథ.
తమకి వయసు ముదిరిపోతున్నా ఎందుకు పెళ్లి కావట్లేదో కారణం తెలుసుకుని, ఇద్దరు ప్రాణ స్నేహితులు ఏం చేశారు? “జగన్మోహిని” కథలో చదవండి.
తొమ్మిది కథల సంకలనం ఈ “చిట్టి పొట్టి కథలు” అనే పుస్తకం. మన కాలనీల్లో జరిగే ముచ్చట్లు ఈ కథలు! మన కమ్యూనిటీల్లో దొర్లే కబుర్లు ఈ కథలు.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners