ప్రపంచంలో అన్నిటికన్నా వింత అయినది మనిషి జీవితం. జీవితం పుట్టుకతో మొదలవుతాయి , మరణం తో ముగుస్తాయి. ఈ రెండింటి మధ్య జరిగే ప్రయాణమే జీవితం. ఈ ప్రయాణంలో స్నేహితులు, తోబుట్టువులు, తల్లి దండ్రులు ఇంకా ఎందరెందరో పాలు పంచుకొంటారు. ప్రయాణించే వేగం, నిర్ణయించుకొన్న గమ్యాలు, పయనించే దారులు, రక రకాల రూపాలలో మార్గ దర్శకులు, మార్గంలో ఒడిదొడుకులు, అడ్డంకులు, అలుపు , ఆట పాటలు, ఈ ప్రయాణాన్ని గురించి ఎంత చెప్పిన తక్కువే... అందరి ప్రయాణాలు గురించి నేను వివరించలేను కానీ, ఈ పుస్తకంలో ఒక సగటు కుటుంబం, ఆ కుటుంబం లోని వారి జీవిత ప్రయాణం వివరించాను. ఈ పుస్తకం లో నేను నాకు తెలిసిన ఒక సగటు కుంటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశాను.
అన్యోన్యంగా ఉండే భార్య భర్త, అత్తా మామలను గౌరవంగా చూసుకొనే కోడలు, తనకు తెల్సిన ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచు కోవాలని తపించే ఒక వనిత ను ఈ పుస్తకం మీకు పరిచయం చేస్తుంది. జీవిత విలువలను తెలియ చెప్పే తాత గారు, పాత రోజుల్లో జీవన విధానాన్ని తెలియచేసే నాయనమ్మ, ఉద్యోగం, ప్రేమ పెళ్లి లో సతమతమవుతున్న యువ పాత్రలు ఈ పుస్తకానికి ఆసక్తిని పెంచుతాయి. మొదటి భాగమైన ఈ సగటు కుటుంబం ఒక ప్రత్యేక మైన కుటుంబ ఎలా రూపు దిద్దుకొంటుందో తరువాతి భాగాలలో తెలియచేస్తాను.