Share this book with your friends

Vyaasabhaaratamlo Asalu Karnudu / వ్యాసభారతంలో అసలు కర్ణుడు

Author Name: Vedantam Sripatisarma | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

భారతంలో కర్ణుడి పాత్ర అందరికీ తెలిసిందే! అలా అన్నప్పుడు నిజంగా తెలిసిందా? అన్న ప్రశ్న ఏర్పడుతుంది-దానికి కారణం ఆ పాత్ర లోని నాటకీయతను వాడుకుని భారతంలోని అసలు అంశాలను అణగదొక్కిన సందర్భాలు కొన్ని తరాలుగా ప్రజల గుండెల్లో నాటుకునిపోవటం! అసలు భారతంలో వ్యాసుడు కర్ణుని ఎలా చిత్రీకరించాడు? అన్న ప్రశ్న కూడా ఎవరికీ కలుగకపోవటం. భారతంలో వ్యాసుడు కర్ణుని గురించి పాత్ర ద్వారా, కథాగమనం ద్వారా ఏమి నిర్ణయాత్మకంగా చెప్పాడు అన్నది ఈ పుస్తకంలో మూలగ్రంథంలోని శ్లోకాల ద్వారా, సరళమైన వ్యాఖ్యానం ద్వారా చూడవచ్చు. కర్ణుని ప్రజ్ఞ నిజంగా అర్జునుని కౌశలం కంటే గొప్పదా? ధర్మం అతనిపట్ల ఉన్నదా? యుద్ధానికి కారకుడా? అసలు దేని కోసం చివరి వరకూ పోటీ పడ్డాడు? చదివి తెలుసుకోండి...

Read More...
Paperback
Paperback 199

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

వేదాంతం శ్రీపతిశర్మ

వేదాంతం శ్రీపతిశర్మ తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో వ్రాస్తారు. ఈ భాషలలో అనేక ప్రసంగాలు చేసారు. వాల్మీకి రామాయణం 24 వేల శ్లోకాలను భావాలతో సహా వివరించి యున్నారు. ఈయన కథలు, నవలలు పాఠకులకు పరిచయమే. హిందీ, తెలుగు భాషలలో ఈయన నాటకాలు, నాటికలు ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నాయి. ఇటీవల హిందీ నాటిక 'ఛతరీ 'కి ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందుకున్నారు. హాస్యం , గాంభీర్యం-రెండూ పండించగల రచయిత. 'ఆదికావ్యం లోని ఆణిముత్యాలు' అనే శీర్షిక క్రింద ప్రస్తుతం వాల్మీకి రామాయణం లోని కొన్ని శ్లోకాలను ఎంచుకుని జనసామాన్యానికి ఉన్న అపోహలను తొలగిస్తూ అలాగే రామాయణం లోని గూఢార్థాలను, ప్రధానమైన అంశాలను ఆవిష్కరిస్తున్నారు. ఇది 'సంచిక' అనే అంతర్జాల పత్రికలో వారం వారం ప్రచురితమవుతున్నది. 'ధ్వని ధన్వంతరి' అనే శీర్షిక క్రింద అగ్రణి మీడియా అనే యు ట్యూబ్ చానెల్ లో రాగాలను ఎంచుకుని పలు వ్యాధులకు ధ్వని చికిత్సగా అందిస్తున్నారు. వేదాంతం శ్రీపతిశర్మ నటులు, దర్శకులు కూడా.  వీరు రచించిన 'ఆరోగ్యభాగ్యచక్రం' అనే జ్యోతిషగ్రంథం ప్రజాదరణ పొందినది. ప్రతి సంవత్సరం వీరు శ్రీసత్యసాయి కేంద్రం వారి శివం కేంద్రం (హైదరాబాదులో) ఉగాదికి పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. శర్మగారు సినీ విశ్లేషకులు కూడా. వీరు రచించిన సదర్న్ గ్లోరీ (ఆంగ్లం) 34 దక్షిణ భారతీయ చిత్రాల సమీక్ష తెలుగులో కూడా అనువదింపబడింది. వరుసగా ఎన్నో సంవత్సరాలు అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలలో ఆకాశవాణికి చలనచిత్ర సమీక్షకులుగా వ్యవహరిస్తూ వచ్చారు.  

Read More...

Achievements

+5 more
View All