Share this book with your friends

Swayamjudham / స్వయంజూదం

Author Name: Pathapally Anurag | Format: Paperback | Genre : Poetry | Other Details

మన జీవితాలు మన నియంత్రణ తప్పి మననే కష్టపెడుతున్నా, ఆ కష్టాలపై
మన దృష్టి వెళ్ళటం లేదు, ఎందుకంటే మనము ఒక మాయా లోకంలోకి
ప్రవేశించాం కాబట్టి. ఆ లోకం లోనికి స్వయంగా మనమే వెళ్ళాము, కానీ
బయటకు వచ్చే దారి మాత్రం మనకు తెలియటం లేదు. ఒకటి కావాలి అంటే
ఇంకోటి వదులుకోవాలి అని అంటారు, అలానే, మనం ప్రవేశించిన ఆ మాయాలోకం
లో నుంచి బయటకు రావాలంటే మనము కూడా కొన్ని వదులుకోవాలి. ఇది అచ్చం
జూదం లాంటిదే. కానీ ఈ జూదం ఇతరులతో కాదు, మనతో మనకే జరిగేది. అందుకే ఆ
మిథ్యాలోకం లోనుంచి బయటకు రావాలంటే మన ప్రస్తుత మనిషిని, మనసుని,
స్వభావాన్ని పణంగా పెట్టి స్వయంజూదాన్ని ఆడితే కానీ బయటికి రాలేము.
మిథ్యాలోకములో నుంచి మిమల్ని బయటకు పంపించడం, లేదా మీరు ఉన్న లోకం
యొక్క నిజ స్వరూపాన్ని చూపటమే ఈ పుస్తక లక్షణం. అందుకే స్వయంజూదం
అనే ఈ పుస్తకం కేవలం ఒక కవితా సంపుటి కాదు, మనం మనతో పాడుకోవాల్సిన
పాటలు, మనతో మనం పలకలేక ఆపేసిన మాటలు, ఈ పుస్తకం లోని రాతలు.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

పాతపల్లి అనురాగ్

పాతపల్లి అనురాగ్ గారు 2003 జూన్ 8న మహబూబ్ నగర్ లో శ్రీమతి వందన, శ్రీ
శ్రీనివాస్ రావు దంపతులకు జన్మించారు. 2024లో ఉస్మానియా
విశ్వవిద్యాలయం నుండి బి.ఇ (మెకానికల్) పూర్తి చేసి ప్రస్తుతం
చెన్నైలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న వయసు నుంచే కథలు, కవిత్వం,
చిత్రీకరణ పట్ల ఆసక్తి పెంపొందిన అనురాగ్, సమాజంలోని విభేదాలు,
హింసలు, అసమానతలపై తన దృష్టిని కవితలలో వ్యక్తీకరించడం
మొదలుపెట్టారు.
"మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం" అన్న మహాకవి శ్రీ శ్రీ గారి
భావజాలం ప్రభావంతో, మనిషి తనలో తానే పోరాడే యుద్ధాన్ని
ప్రతిబింబించేందుకు స్వయంజూదం అనే ఈ కవితా సంపుటిని రచించారు.

Read More...

Achievements