Share this book with your friends

Vatavruksham Odilo Vennela Seethakoka Chiluka / వటవృక్షం ఒడిలో వన్నెల సీతాకోక చిలుక Chronicles of Life/క్రానికల్స్ ఆఫ్ లైఫ్

Author Name: Padmaja Penmetsa | Format: Hardcover | Genre : Self-Help | Other Details

‘వటవృక్షం ఒడిలో వన్నెల సీతాకోకచిలుక’ చదవదగ్గ ఒక మంచి రచన. మనం జీవన పోరాటంలో కోల్పోతున్న రోజువారీ చిన్న చిన్న ఆనందాలను మనకు గుర్తుచేస్తుంది ఈ పుస్తకం. పాత్రల ద్వారా అన్యాపదేశంగా ,సాధారణంగా సాగిన వివరణ చదువరులను ,వారిలో దాగివున్న సామర్ధ్యాన్ని చూసేటట్లుగా చేస్తుంది. తాము ఏమిటో,ప్రయత్నిస్తే తాము ఏమిసాధించగలము అనే విషయాల గురించిన ఆత్మపరిశీలనకు దారి తీసేదిగా వుంటుంది.ఎన్నో అసంపూర్ణమైన అంశాలు తనలో వున్నప్పటికి, అన్నింటిలో పరిపూర్ణురాలనే  అన్నట్లుగా ,సాగిపోతూ నల్లని గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోకచిలుకలా మారింది నవ్య. జీవితం జీవించటానికే అన్న వేదాంతాన్ని కొత్తగా చూపించింది ఈ రచన. కధాంశం చదువరులకు తమ జీవనయానంలోని  గతస్మృతులను గుర్తుకుతెచ్చేదిగా వుంది.సాధారణంగా వున్న ఈ చిన్న కథ ప్రతిఒక చోట,ప్రతిఒక్కరు చూసేదే,అనుభవించేదే. కథలో వున్న ఈ విశ్వజననీయత నిజంగా అభినందనీయం.

Read More...
Hardcover
Hardcover 350

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

పద్మజ పెన్మెత్స

రచయిత్రి పద్మజపెన్మెత్స ఒక మహిళా వ్యవస్థాపకురాలిగా విభిన్నరంగాలకు చెందిన రకరకాల వ్యక్తులతో కలసి పనిచేయటం ద్వారా ,వారిలోని అంతర్గత సామర్ధ్యాలను వెలికితీసి,వారు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి తనదైన శైలిలో  దిశానిర్దేశం చేస్తూవుంటారు. లక్ష్యసాధనలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ, బలాబలాలనుబేరీజు వేసుకుంటూ,బలహీనతలను ఒప్పుకుంటూ,బలాలను మరింత పెంచుకొంటూ పోయే ఆమె ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది.

ఏం.బి.ఏ పట్టభద్రురాలైన పద్మజ కార్పొరేట్ రంగంలోని మానవనైపుణ్యాలు అనే అంశం మీద వున్న ఆసక్తితో, మానవవనరుల విభాగానికి అధిపతిగా ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో పని చేశారు.బ్రిటన్ దేశం నుండి వ్యూహాత్మక మానవవనరుల విభాగంలో మరొక ఉన్నత డిగ్రీ సాధించారు. అంతేకాదు మనస్తత్వశాస్త్రంలో కూడా ఈమె మాస్టర్స్ డిగ్రీ సాధించారు.

ప్రస్తుతం పద్మజ ఎలైన్  జాయ్.ఎల్.ఎల్.పి. అనే పేరుతో తన స్వంత సంస్థ నెలకొల్పి,తన వ్యూహాత్మక ప్రణాళికలమీద పనిచేస్తున్నారు.ఆమె తన పనులతో తీరికలేకుండా వున్న కూడా వివిధ సంస్థలలోని ఉద్యోగులకు సరైన నాయకత్వ విధానాలను పొంపొందించుకోవటం ఎలా అన్న అంశంపై సూచనలు సలహాలు ఇస్తూ వుంటారు. తమ సామర్ధ్యాలను మెరుగుపరచుకొంటూ, జీవితంలో ముందుకు సాగటం కోసం తమ శాయశక్తుల కృషి చేసేవారికి ఈమె తర్ఫీదు ఇస్తూ వుంటారు. 

 

Read More...

Achievements

+7 more
View All