Share this book with your friends

Jeevitham O Prayanam / జీవితం ఓ ప్రయాణం Aagani Payanam/ ఆగని పయనం

Author Name: Ramani Latha Mangalampalli | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

ప్రపంచంలో అన్నిటికన్నా వింత అయినది మనిషి జీవితం. జీవితం పుట్టుకతో మొదలవుతాయి , మరణం తో ముగుస్తాయి. ఈ రెండింటి మధ్య జరిగే ప్రయాణమే జీవితం. ఈ ప్రయాణంలో స్నేహితులు, తోబుట్టువులు, తల్లి దండ్రులు ఇంకా ఎందరెందరో పాలు పంచుకొంటారు. ప్రయాణించే వేగం, నిర్ణయించుకొన్న గమ్యాలు, పయనించే దారులు, రక రకాల రూపాలలో మార్గ దర్శకులు, మార్గంలో ఒడిదొడుకులు, అడ్డంకులు, అలుపు , ఆట పాటలు, ఈ ప్రయాణాన్ని గురించి ఎంత చెప్పిన తక్కువే...  అందరి ప్రయాణాలు గురించి నేను వివరించలేను కానీ, ఈ పుస్తకంలో ఒక సగటు కుటుంబం, ఆ కుటుంబం లోని వారి జీవిత ప్రయాణం వివరించాను. ఈ పుస్తకం లో నేను నాకు తెలిసిన ఒక సగటు కుంటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశాను. 

అన్యోన్యంగా ఉండే భార్య భర్త, అత్తా మామలను గౌరవంగా చూసుకొనే కోడలు, తనకు తెల్సిన ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచు కోవాలని తపించే ఒక వనిత ను ఈ పుస్తకం మీకు పరిచయం  చేస్తుంది. జీవిత విలువలను తెలియ చెప్పే తాత గారు, పాత రోజుల్లో జీవన విధానాన్ని తెలియచేసే నాయనమ్మ, ఉద్యోగం, ప్రేమ పెళ్లి లో సతమతమవుతున్న యువ పాత్రలు ఈ పుస్తకానికి ఆసక్తిని పెంచుతాయి. మొదటి భాగమైన ఈ సగటు కుటుంబం ఒక ప్రత్యేక మైన కుటుంబ ఎలా రూపు దిద్దుకొంటుందో తరువాతి భాగాలలో తెలియచేస్తాను.

 

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

Also Available On

రమణీలత మంగళంపల్లి

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షరామం లో పుట్టి, బంగాళాఖాతం ఒడ్డున ఉన్న భీమిలి సముద్రతీరంలో పెరిగాను. గణితంపై ఉన్న ఆసక్తి, నా ఉపాధ్యాయుల, తల్లి దండ్రుల ప్రోత్సాహం నన్ను కెమికల్ ఇంజనీర్‌ని చేసాయి. 

గ్రాడ్యుయేషన్ తర్వాత, నేను ముంబైకి మకాం మార్చడానికి ముందు హైదరాబాద్‌లో చిన్న పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం మొదలుపెట్టాను. తర్వాత IIT ముంబై లో రీసెర్చ్ అసోసియేట్‌గా ప్రారంభించి, అప్పుడే బాగా వృద్ధి చెందుతున్న భారతీయ ఐటీ రంగంలోకి ప్రవేశించాను. ప్రపంచం ఇంత చిన్నదా అన్నట్టుగా పరిమితులు లేని ప్రపంచాన్ని పరిచయం చేసింది IT రంగం. ఊహించని వియన్నా ప్రయాణం, మరియు ఐక్యరాజ్యసమితి లో  ఉద్యోగం వ్యక్తులు, సంబంధాలు మరియు సమాజంపై  నా దృక్పథాన్ని మరింత విస్తృతం చేసింది.

చిన్నతనంలో రాజమండ్రి, ద్రాక్షారామ, కోనసీమ ప్రయాణాల్లోనే నాకు కవితలు రాయడం పట్ల మక్కువ మొదలైంది. పాఠశాల పోటీల నుండి ప్రేరణ పొంది, నేను నాటకాలు, బ్లాగులు, కథలు సామాజిక సమస్యలను ప్రతిబింబించే కవితలు, మరియు మానవ సంబంధాలను గూర్చి రాయడం ప్రారంభించాను. 

"జీవితం ఓ ప్రయాణం" కూడా అటువంటి ఒక ప్రయత్నం. నా జీవిత ప్రయాణంలో ఎదురైన నిజ జీవిత అనుభవాల నుండి ప్రేరణ పొందిన కల్పిత పాత్రలతో కూడిన పుస్తకమే ఇది.  

Read More...

Achievements