పీసపాటి చంద్రశేఖర్ 1955 జూలై నెల 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం, లొల్ల గ్రామంలో జన్మించారు. మూడు దశాబ్దాలకు పైగా కాకినాడలోని శ్రీమతి పైండా ఆండాళ్ళమ్మ కళాశాలలో లెక్చరర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. తెలుగు రచనలో విశేష అనుభవం ఆయన సొంతం. 1981లో ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన కధల పోటీలో తన ‘గృహరాజు’ కధకు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుండి వరుసగా దాదాపు అన్ని తెలుగు పత్రికలలోనూ అనేకమైన కధలు ప్రచురించబడ్డాయి. బహుమతి పొందిన కధలు 27 వరకూ ఉంటాయి. చలం, శ్రీశ్రీ, లత సాహిత్యాలు చదివారు. సిడ్నీ షెల్డన్ ఆయ అభిమాన ఆంగ్ల రచయిత. చాలా వరకూ ఈ-జర్నల్స్‌లో తన ఆంగ్ల పద్యాలు ప్రచురితమవుతున్నాయి. ప్రస్తుత రచన ‘సౌందర్య శిఖరం – అమ్మ’ అనేది రచయిత మొట్టమొదటి తెలుగు గ్రంధం. విశ్వవ్యాప్తముగా వున్న ‘అమ్మ’ యొక్క ప్రేమతత్త్వాన్ని ఆవిష్కరించడం ఈ రచన యొక్క ప్రధాన ఉద్దేశ్యం.