శ్రీ ముత్తు స్వామి ధీక్షితర్ రచించిన నవావర్ణ కృతులు సంగీత ప్రియులకు గొప్ప వరము. వివిధ కుందలినీ చక్రములకు తగిన రాగములను నిర్ధారించి ఎంతో అద్భుతముగ సృష్టించారు. ఒక స్థిరమైన క్రమములో మూల చక్రము నుండి మధ్య బిందువు వరకు ప్రతి కృతికి ప్రత్యేకతను కనబరిచారు. చివరి కృతి, చక్రములోని అన్ని మంత్రములను అందముగ వివరించారు. తమ గురువైన శ్రీ చిదంబర స్వామి నుండి అభ్యసించిన శ్రీ విద్యా మహా శోడషాక్షరీ మంత్రమును క్షుణ్ణముగ పరిశోధించి ఈ కీర్తనా సృష్టి చేసిరి.
ఇంతవరకు ఈ కీర్తనలకు సరియైన స్వర వివరణ లేని కారణమున సంగీత విద్యార్ధులకు సరియైన విధానంతో అభ్యసించుటకు కష్టతరముగుట వలన ఈ పుస్తకములో సవివరంగా స్వరములు విశధీకరించబడినవి.
ముత్తు స్వామి దీక్షితుల నిజ జీవిత ముఖ్య ఘటనలను కొన్ని, శ్రీ చక్రము, శ్రీ లలితాంబిక వర్ణ చిత్రము ఈ పుస్తకమందు పొందు పరిచ బడినవి.
ఈ పుస్తకము తెలుగు, తమిళ, ఆంగ్ల భాషలలో అందరికీ అందుబాటులో ఉండుటకై రచింపటడినది.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners