“విధి చేయు వింతలన్నీ మతిలేని చేతలేనని ...” అన్నాడో సినీకవి .
ఈ పాట విన్న తర్వాత నాకున్న అనుభవ రీత్యా
“విధి చేయు వింతలన్నీ మతి చేసే చేతలేనని ...” పాడుకోవాలనిపించింది.
“మతి”.…అదే మనసు...
చేసేవన్నీ పిచ్చి చేష్టలే.. కానీ మనసది ఒప్పుకోదు.ఎందుకంటే పిచ్చివాళ్ళెపుడూ తాము పిచ్చివాళ్ళమనిఒప్పుకోరు.
అలాంటి మనసున్న పిచ్చివాళ్ళ కధల సమాహారమే ఈ “మనసు గతి ఇంతే..” పుస్తకం.
ఇందులో ఓ వ్యక్తీ తన కొడుకు చేసిన పొరపాటును తన ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు.మరొకతను ఆత్మహత్య చేసుకునేముందు తన గోడు వినే మనిషి కోసం వెతుకుతాడు.ఇంకొకతనైతే పిల్లలు దూరమయ్యాక మరచిపోవడానికి మొక్కలను పెంచుకుంటాడు. పెంచిన మరులు మరచిపోలేనిమరో మనిషైతే పూర్తిగా కుక్కలా మారిపోతాడు. లేటువయసులో పిల్లల్ని కన్న తండ్రి వ్యధ మరొకరిది. మతపిచ్చి మమకారాల మద్య నలిగిపోయే మనసు ఇంకొకరిది. బుద్ధితో నిరంతరం పోరాడే మనసు పడే పాట్లు మరొకరివి.
ఈ మనసు (నుషు)ల ఘోష మీరంతా వింటారని మనస్పూర్తిగా ఆశిస్తూ
- యేటూరి శ్రీనివాసులు
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners