పెట్రోలియం నిల్వలకన్నా వేగంగా భూగోళం మీది మంచినీటి నిల్వలు తరగిపోతున్నా గమనించలేని ప్రమత్తత ఆధునిక సమాజాన్ని ఆవరించిన సమయంలో, ఓ వైపు, పర్యావరణానికి తీరని హాని జరుగుతున్నా, ఏటా లక్షల ఎకరాల పంటభూమి నిస్సారంగా మారిపోతున్నా, పట్టించుకోకుండా, ప్రగతికీ, వాపుకూ తేడా తెలుసుకోలేని దురవస్థలో పడున్న పాలనావ్యవస్థ!
మరోవైపు, చరిత్రలో కనీ, వినీ, ఎరుగని కొత్తవ్యూహంతో దాడిచేసి, మన దేశాన్ని కోలుకోలేని దెబ్బతీయాలనే పగతో పావులు కదుపుతున్న శతృవులు!