Share this book with your friends

Manasu Gathi Inthe / మనసు గతి ఇంతే

Author Name: Yeturi Srinivasulu | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

“విధి చేయు  వింతలన్నీ మతిలేని చేతలేనని ...” అన్నాడో సినీకవి .
ఈ పాట విన్న తర్వాత  నాకున్న అనుభవ రీత్యా 
“విధి చేయు  వింతలన్నీ మతి చేసే  చేతలేనని ...” పాడుకోవాలనిపించింది.
“మతి”.…అదే మనసు...
చేసేవన్నీ పిచ్చి చేష్టలే.. కానీ మనసది ఒప్పుకోదు.ఎందుకంటే పిచ్చివాళ్ళెపుడూ తాము పిచ్చివాళ్ళమనిఒప్పుకోరు.
అలాంటి మనసున్న పిచ్చివాళ్ళ కధల సమాహారమే ఈ “మనసు గతి ఇంతే..” పుస్తకం.
ఇందులో ఓ వ్యక్తీ తన కొడుకు చేసిన  పొరపాటును  తన ప్రాణం మీదకు తెచ్చుకుంటాడు.మరొకతను ఆత్మహత్య చేసుకునేముందు  తన గోడు  వినే మనిషి  కోసం వెతుకుతాడు.ఇంకొకతనైతే పిల్లలు దూరమయ్యాక మరచిపోవడానికి  మొక్కలను పెంచుకుంటాడు. పెంచిన మరులు మరచిపోలేనిమరో  మనిషైతే పూర్తిగా కుక్కలా మారిపోతాడు. లేటువయసులో పిల్లల్ని కన్న తండ్రి వ్యధ మరొకరిది. మతపిచ్చి  మమకారాల మద్య నలిగిపోయే  మనసు ఇంకొకరిది. బుద్ధితో నిరంతరం పోరాడే మనసు  పడే పాట్లు మరొకరివి.
 ఈ మనసు (నుషు)ల ఘోష   మీరంతా వింటారని  మనస్పూర్తిగా   ఆశిస్తూ 
                                                                                - యేటూరి శ్రీనివాసులు

 

Read More...
Paperback
Paperback 249

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

యేటూరి శ్రీనివాసులు

ఊహా జనిత విషయాన్నుండి వాస్తవాన్ని భోదించే  ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్  పట్టబధ్రుడు ఈ రచయిత. పేరు యేటూరి శ్రీనివాసులు. ఊరు వైకుంఠపురం , కావలి , నెల్లూరు జిల్లా.     “ప్రతిలిపి” లో  రచనలతో ఓనమాలు దిద్దుకున్న ఇతను ,ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా   తన ఉద్యోగాప్రస్తానం ఎలాఉన్నా , సబ్జెక్టు నేర్పిన ఒరవడి తోనే తన ఊహలను వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఇతని ప్రతీ రచనలో కనబడుతూ ఉంటుంది . దీనికి తోడు   ఓ సామాన్య కుటుంభం నుండి వచ్చిన  నేపద్యం  ఉండడంతో   ఇతను ఎంచుకొనే పాత్రలు కూడా  అతి సామాన్యంగా మన చుట్టూ ఉన్నట్టే ఉంటాయి. దాంతో  తను వ్రాసేవి నిజంగా జరిగాయన్నట్టుగా  నమ్మించడం  ఇతనికి  వెన్నతో పెట్టిన విద్య . “అల వైకుంఠపురములో అర డజను కధలు” అనే ఇతని కధల సంపుటి దీనికో  మంచి ఉదాహరణ.  వర్క్ లోడ్ నుండి రిలాక్స్ అవడానికి ఎంచుకున్న  తన  ఊహా ప్రపంచ నిర్మాణానికి ఓర్పుతో సహకరిస్తున్నవారిలో సింహభాగం   పిల్లలు రామ్మోహన్ , వాణీల  మద్దత్తుతో తన శ్రీమతి ఉదయలక్ష్మిదే .  ఇక  తన వెన్నుదన్ను తన మేనల్లుడు, రచయిత  శశిధర్ కరేటి  సరేసరి.

Email.ID. yeturisrinivasulu7@gmail.com

Instagram: @srinivasulu_yeturi
Facebook: @srinivasulu.yeturi
Twitter: @yeturisrinivas1
Swell: @ysrinivasulu

 

Read More...

Achievements

+1 more
View All