Share this book with your friends

Sri Kamalamba Navavarna Keerthanalu / శ్రీ కమలాంబా నవావర్ణ కీర్తనలు Composition Of Sri Muthuswami Dikshithar / శ్రీ ముత్తు స్వామి దీక్షితర్ వారి రచన

Author Name: Nallan C Mohan | Format: Paperback | Genre : Music & Entertainment | Other Details

శ్రీ ముత్తు స్వామి ధీక్షితర్ రచించిన నవావర్ణ కృతులు సంగీత ప్రియులకు గొప్ప వరము. వివిధ కుందలినీ చక్రములకు తగిన రాగములను నిర్ధారించి ఎంతో అద్భుతముగ సృష్టించారు. ఒక స్థిరమైన క్రమములో మూల చక్రము నుండి మధ్య బిందువు వరకు ప్రతి కృతికి ప్రత్యేకతను కనబరిచారు. చివరి కృతి, చక్రములోని అన్ని మంత్రములను అందముగ వివరించారు. తమ గురువైన శ్రీ చిదంబర స్వామి నుండి అభ్యసించిన శ్రీ విద్యా మహా శోడషాక్షరీ మంత్రమును క్షుణ్ణముగ పరిశోధించి ఈ కీర్తనా సృష్టి చేసిరి.

ఇంతవరకు ఈ కీర్తనలకు సరియైన స్వర వివరణ లేని కారణమున సంగీత విద్యార్ధులకు సరియైన విధానంతో అభ్యసించుటకు కష్టతరముగుట వలన ఈ పుస్తకములో సవివరంగా స్వరములు విశధీకరించబడినవి.

ముత్తు స్వామి దీక్షితుల నిజ జీవిత ముఖ్య ఘటనలను కొన్ని, శ్రీ చక్రము, శ్రీ లలితాంబిక వర్ణ చిత్రము ఈ పుస్తకమందు పొందు పరిచ బడినవి.

ఈ పుస్తకము తెలుగు, తమిళ, ఆంగ్ల భాషలలో అందరికీ అందుబాటులో ఉండుటకై రచింపటడినది.   

Read More...
Paperback
Paperback 580

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

నల్లాన్ సి మోహన్

శ్రీ నల్లాన్ సి మోహన్ గారు ఉన్నతమైన వైణిక కుటుంబమునకు చెందినవారు. వారి తండ్రిగారైన శ్రీ ఎన్.సి. పార్ధసారధి గారి వద్ద వీరు వీణను అభ్యసించి, తన ఎనిమిదవ యేటినుండే వీణ కచ్చేరీలు చేసేవారు. చదివిన స్కూలు, కాలేజి, మ్యూజిక్ అకాడమి, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ వంటి పెద్ద సంస్ధల నుండి బహుమతులు, పురస్కారములు గడించిరి. సంగీతములో (వీణ, గాత్రం) లో ప్రాధమిక, ఉన్నత డిప్లొమాలు ఫస్ట్ క్లాస్లో పాసైనారు.

 ఆల్ ఇండియ రేడియో పిల్లల ప్రోగ్రాంలో తరచు వీణ వాయించేవారు. కాలేజి రోజులలో పేరుగాంచిన మ్యూజిక్ డైరెక్టరుల వద్ద కొన్ని సినిమలలో (తమిళ, తెలుగు) బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించేవారు.

శ్రీ చెంబై వైద్యనాధ అయ్యర్ వద్ద సంగీతము, పల్లవి నరసింహ నాయుడు గారి వద్ద పల్లవులు, శ్రీ ఖేల్కర్ వద్ద సితార్, తన కాలేజి సీనియర్ వద్ద బుల్ బుల్ తరంగ్, ఉద్యోగరీత్యా "ఇరాన్" దేశంలో ఉండేటపుడు సంతూర్ వాద్యాని అక్కడి విధ్వాంసుల వద్ద అభ్యసించారు. 

1975 లో వీరి ప్రోగ్రాం "మరు పక్కం" అను పేరుతో తమిళ టీవీ ఛానల్ లో ప్రసారింప బడింది. వీరు అనేక తిల్లానాలను, స్వరజతులను రచించారు. 

ఆయిల్ అండ్ గ్యాస్ ఇంజనియర్ గా వివిధ పట్టణాలలో, దేశాలలో పని చేస్తున్నా, సంగీత సాధన, కచ్చేరిలు కొనసాగేవి. ఉన్నతాధికారిగా ఉద్యోగ విరామానంతరం దృష్టి సంగీతం పైనే కేంద్రీకరించి అనేక వీడియోలు చేస్తున్నారు.

Read More...

Achievements

+4 more
View All