వెంటాడే ఆలోచన..
మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.
సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఈ కథకు హీరో అయిన “విక్రమ్” ను భయపెడుతోంది.
అసలు భయమే ఎరుగని విక్రమార్కుడి పేరు పెట్టుకున్న మన హీరో ఎందుకు భయపడుతున్నాడు?
అతన్ని వెంటాడే ఆ ఆలోచన ఏంటి?
ఆ ఆలోచన నుంచి బయటపడేలా చేసిన ఆ అమ్మాయి ఎవరు?
ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం విక్రమ్ ప్రేమ కథ చదవాల్సిందే.
ఇది ప్రేమ కథ కాబట్టి దీనికి “ నా జీవితం లోని తొలి పౌర్ణమి” అనే పేరు పెట్టాను.
కానీ దీనికి ఇంకో కోణం కూడా ఉంది—
దానికి సరిపోయే పేరు “వెంటాడే ఆలోచన.”