Share this book with your friends

Naa Jeevitham Loni Tholi Pournami / నా జీవితంలోని తొలి పౌర్ణమి

Author Name: Junje | Format: Hardcover | Genre : Literature & Fiction | Other Details

వెంటాడే ఆలోచన..

మనం భవిష్యత్తుని తరిమితే మనల్ని తరిమేదే గతం, ఇక్కడ గతం అంటే సమయం కాదు సందర్భం, మన మనస్సులో  ఏదో ఒక మూలన నిలిచిపోయిన ఆలోచన మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది.

సరిగ్గా ఇలాంటి ఆలోచనే ఈ కథకు హీరో అయిన “విక్రమ్” ను భయపెడుతోంది.

అసలు భయమే ఎరుగని విక్రమార్కుడి పేరు పెట్టుకున్న మన హీరో ఎందుకు భయపడుతున్నాడు?
అతన్ని వెంటాడే ఆ ఆలోచన ఏంటి?
ఆ ఆలోచన నుంచి బయటపడేలా చేసిన ఆ అమ్మాయి ఎవరు?

ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం విక్రమ్ ప్రేమ కథ చదవాల్సిందే.

ఇది ప్రేమ కథ కాబట్టి దీనికి “ నా జీవితం లోని తొలి పౌర్ణమి” అనే పేరు పెట్టాను.
కానీ దీనికి ఇంకో కోణం కూడా ఉంది—
దానికి సరిపోయే పేరు “వెంటాడే ఆలోచన.”

Read More...

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

జుంజే

ఒక చిన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ,
స్నేహితులతో సరదాగా గడిచే సాధారణ జీవితంలో,

ఏదో తెలియని ఒక లోటు నా మనసులో ఎప్పుడూ ఉండేది.

నేను ప్రేమించిన వాళ్లు చాలామందే…

ఆ ప్రేమను మాటల్లో చెప్పే ధైర్యం లేక,
ఎన్నో కథలు నా మనసులోనే ఆగిపోయాయి.

అలా ఆగిపోయిన ప్రేమల నుంచి
మిగిలిన అనుభవాలు, ఊహలే
ఈ కథగా మారాయేమో నాకు తెలీదు.

ఇది కేవలం ఒక ప్రేమ కథ కాదు,
నా మనసులో నిశ్శబ్దంగా సాగిన
సంఘర్షణల ప్రతి బింబం

Read More...

Achievements