పోషకాహార సమాచారాన్ని అర్థవంతంగా అందించుటకు న్యూట్రీషనల్ సీక్రెట్స్ ఒక కొత్త బెంచ్ మార్క్ ను అందించింది. ఒక వృత్తాంతముగా ఏర్పాటు చేసిన ఫ్లో చార్ట్స్, టిప్స్ మరియు మార్గదర్శకాలు కిడ్నీ రోగులు తమ ఆరోగ్యాన్ని బాగా నిర్వహిస్తూ మరిన్ని సంవత్సరాలు జీవించేందుకు తగిన కారణాన్ని అందిస్తుంది.
ప్రధాన న్యూట్రీషనల్ అంతర్భాగాలను స్పష్టంగా గుర్తించే ప్రయత్నములో, ఈ పుస్తకము కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, ఫైబర్, ఫాట్స్ మరియు ఫ్లూయిడ్ గురించి ప్రస్తావిస్తుంది. కిడ్నీ రోగులకు సంపూర్ణ పోషకాహారము అవసరము అనేది కూడా ఇది తెలియజేసింది.
లాబొరేటరీ ఫలితాల ఆధారంగా డైట్ యొక్క సమయానుసార అంచనాల గురించి తెలుపుతూ కిడ్నీ వ్యాధి యొక్క అన్ని దశలలో డైట్ నిర్వహణ కొరకు ఈ పుస్తకము సూచనలు అందిస్తుంది మరియు రోగులను ధృవీకరణల కొరకు డైటీషియన్స్/డాక్టర్స్ వద్దకు పంపుతుంది.
దీనిని మరింత విశ్వసనీయంగా మరియు ప్రామాణికంగా చేయుటకు న్యూట్రీషనల్ సమాచారము అంతా 2017లో ఇండియా ఫుడ్ కంపోజిషన్ టేబుల్స్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ విడుదల చేసిన తాజా పరిశోధన పై ఆధారపడి ఉంటుంది.