Share this book with your friends

Sujalaam.. Suphalaam / సుజలాం.. సుఫలాం Samakaleena Neeti Samasyalu – Savalla Avalokanam / సమకాలీన నీటి సమస్యలు - సవాళ్ళ అవలోకనం

Author Name: K.B. Dharma Prakash | Format: Paperback | Genre : Technology & Engineering | Other Details

నీరు సకల జీవచరాలకు జీవన ఆధారం. సృష్టిలో జీవుల మనుగడకు కావల్సిన ముఖ్య అవసరాలలో గాలి తర్వాతి స్థానం నీటిదే. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వనరు నీరు. నదీజలాలు, భూగర్భజలాలు నేడు కాలుష్యత కోరలలో చిక్కుకుని జల సంక్షోభం ఏర్పడి జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 
సమకాలీన నీటి సమస్యలు - సవాళ్ళ గురించి సుజలాం.. సుఫలాం పుస్తకంలో సామాన్య ప్రజలకు అర్థం అయ్యేరీతిన గణాంకాలతో, విశ్లేషణాత్మకంగా వివరించబడింది. జలవనరులను, రక్షించుకోవాల్సిన భాధ్యత గురించి తెలుపడంలో ఈ పుస్తకంలోని అంశాలు ఉపయోగపడతాయి.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

కె.బి. ధర్మప్రకాశ్

11 మార్చి 1968 రోజున తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా, ధర్మసాగరం మండల కేంద్రంలో శ్రీమతి మల్లికాంబ శ్రీ సాంబయ్య దంపతులకు జన్మించాడు. సామాజిక, పర్యావరణ అవలోకనం కలిగించేలా వ్యాసాలు, పుస్తకాలు వ్రాస్తుంటాడు. వృత్తిపరంగా ఉపాధ్యాయుడు. ప్రవృత్తి పరంగా ఆలిండియా పీపుల్ సైన్స్ నెట్ వర్క్ అనుబంధ జనవిజ్ఞానవేదిక అనే భారతప్రభుత్వ  జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి శాస్త్ర ప్రచార సంస్థలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తుంటారు. ఇగ్నైటెడ్ మైండ్స్, వెల్ విషర్స్ టీచర్స్, శాస్త్ర, మిత్ర మండలి లాంటి అభ్యుదయ సంస్థలలో పనిచేస్తూ శాస్త్రీయ సమాజం, సామాన్య ప్రజల మెరుగైన జీవన ఆవిష్కృతికి పరితపిస్తూ నిత్యం కృషి చేస్తుంటాడు. జీవశాస్త్రంతో బి.ఎస్.సి., ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ., ఇంకా యల్.యల్.బి. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేసాడు. యం.ఇడి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేశాడు. 1990 నుండి ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. 'సుస్థిర పర్యావరణం' అనే పుస్తకం తెలుగులో, "Sustainable Environment" మరియు "Environmental Echoes" అనే పుస్తకాలు ఆంగ్లంలో ప్రచురితమయ్యాయి. వివిధ రూపాలలో వ్యక్తమౌతున్న నీటి సంక్షోభం, నీటి సమస్యలు, సవాళ్లు, పరిష్కారాల గురించిన అంశాలు ప్రజానీకానికి తెలియజెప్పే ప్రయత్నమే ఈ సుజలాం.. సుఫలాం.... వ్యాస సంపుటి.

Read More...

Achievements