అనుకోని పరిస్థితుల్లో ఓ అపరిచిత యువతితో సహజీవనం ఈ నవలా నాయకుణ్ణి ఎలాంటి చిక్కుల్లో పడేసిందనేది ఈ నవల కధాంశం . ప్రేమనేది ఎలా ఎందుకు పుడుతుందో తెలీని ఆ యువతి అతని మనసు తనది కాదని లేలిసి తల్లడిల్లితే... . విధిలేక తనను మరో అమ్మాయి ప్రేమిస్తోందని తన ప్రేయసికే చెప్పిన ఆ ప్రియుడు తన ప్రేయసితో పెళ్లి కోసం వినూత్నంగా చేసిన సాహసమేమిటి.
కన్న కూతురే లోకంగా బ్రతికే ఓ తల్లి భగ్న ప్రేమికురాలై వ్యసనాలకు బానిస అయిన కూతుర్ని చూడలేక ఓ మోసగాని వలలో చిక్కుకున్న వైనం. ఆమెపై కన్నమమకారాన్ని మించిన కృతజ్ఞత చూపిన ఆ కర్కోటకుని కధ .
తన నేర సామ్రాజ్యంలో రారాజుగా వెలుగుతున్న ఓ వ్యక్తి తనకు తెలీకుండానే ఓ అపరిచితుని చేతిలో కీలుబోమ్మైన వైనం.
ఆ భగ్నప్రేమికురాలి మనసు తనది కాదని తెలిసికూడా ఈ లోకంలో ఆమె ప్రేమించినంతగా ప్రేమించేవాళ్ళు ఎవరూ దొరకరని ఆమె సాహచర్యం కోసం ఓ తాపసి ఆరాటం .
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners