‘వటవృక్షం ఒడిలో వన్నెల సీతాకోకచిలుక’ చదవదగ్గ ఒక మంచి రచన. మనం జీవన పోరాటంలో కోల్పోతున్న రోజువారీ చిన్న చిన్న ఆనందాలను మనకు గుర్తుచేస్తుంది ఈ పుస్తకం. పాత్రల ద్వారా అన్యాపదేశంగా ,సాధారణంగా సాగిన వివరణ చదువరులను ,వారిలో దాగివున్న సామర్ధ్యాన్ని చూసేటట్లుగా చేస్తుంది. తాము ఏమిటో,ప్రయత్నిస్తే తాము ఏమిసాధించగలము అనే విషయాల గురించిన ఆత్మపరిశీలనకు దారి తీసేదిగా వుంటుంది.ఎన్నో అసంపూర్ణమైన అంశాలు తనలో వున్నప్పటికి, అన్నింటిలో పరిపూర్ణురాలనే అన్నట్లుగా ,సాగిపోతూ నల్లని గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోకచిలుకలా మారింది నవ్య. జీవితం జీవించటానికే అన్న వేదాంతాన్ని కొత్తగా చూపించింది ఈ రచన. కధాంశం చదువరులకు తమ జీవనయానంలోని గతస్మృతులను గుర్తుకుతెచ్చేదిగా వుంది.సాధారణంగా వున్న ఈ చిన్న కథ ప్రతిఒక చోట,ప్రతిఒక్కరు చూసేదే,అనుభవించేదే. కథలో వున్న ఈ విశ్వజననీయత నిజంగా అభినందనీయం.
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners