Share this book with your friends

My Perfect Gentleman! / మై పర్ఫెక్ట్ జెంటిల్మన్!

Author Name: Padmaja Nawin | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

తన్వి 

సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైనర్

ఫ్రీలాన్సర్ గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ తన సొంత అప్లికేషన్ డిజైన్ కంపెనీ ప్రారంభించాలి అన్న యాంబిషన్ ఉన్న ఇరవై ఐదేళ్ల తెలుగమ్మాయి.

జీవితం నీకు ముళ్ళని ఇస్తే గులాబీల కోసం వెతుకు అని గట్టిగా నమ్ముతుంది. తన జీవితంలోకి తనని ప్రేమించి, తనంటే చాలా పొసెసివ్ గా ఉండే అబ్బాయి భర్తగా వస్తే బాగుంటుంది అని తన కోరిక.

ఆశ్రిత్

సీఈఓ, డిజి-టేల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 

ఏషియన్ జూనియర్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్. ఇంజనీరింగ్ పూర్తి చేసి స్వయంకృషి తో ఎదిగిన ఇరవై ఎనిమిదేళ్ళ తెలుగు అబ్బాయి.

ప్రేమ అంటే పొసెసివ్నెస్(స్వాధీనత). మనకి తెలియకుండానే ప్రేమించిన వాళ్ళకు ఆంక్షలు పెడతాము. దాంతో గొడవలు మొదలవుతాయి. నెమ్మదిగా ఒకరికి ఒకరం బరువు అవుతాము. అందుకే ప్రేమకీ, పెళ్ళికీ నేను ఒక కిలోమీటర్ దూరం అని తనని పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చేవాళ్ళకి మొహమాటం లేకుండా చెప్పేస్తాడు. 

ఇలాంటి భిన్నమైన ఆలోచనలు ఉన్న తన్వి, ఆశ్రిత్ లు కలిస్తే?

Read More...
Paperback
Paperback 399

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

పద్మజ నవీన్

పద్మజ నవీన్ ఐటీ రంగంలో పద్దెనిమిది సంవత్సరాల అనుభవమున్న ప్రొఫెషనల్, ఒక ఐటీ ప్రొఫెషనల్ భార్య, మరియు పదమూడు ఏళ్ల అబ్బాయికి తల్లి. 

ఆమెకు ఫిక్షన్ రచనలు చదవడం అంటే చాలా ఇష్టం, తన కిండిల్ అంటే ప్రాణం. మంచి విలువలని, సంతోషాన్ని పంచే కథలంటే ఎంతో మక్కువ. అలాంటి కథలు పాజిటివిటీని, ఆశని పెంపొందిస్తాయని ఆవిడ నమ్మకం. వాళ్ళ అమ్మగారి ప్రోత్సాహంతో పుస్తకాలు చదవడం చిన్నప్పటినుండి అలవాటు అయ్యింది.

వంట చేయటం, షాపింగ్, నెట్ఫ్లిక్స్ ఇవి ఉంటే చాలు తన మానసిక ఆందోళన ఆమడ దూరం పారిపోతుందని అంటుంటారు. హృద్యమైన ప్రేమకథలు, ఫ్యామిలీ కథలు ఉన్న సినిమాలు చూడడానికి ఇష్టపడతారు.

Read More...

Achievements

+1 more
View All