అనిర్వచనీయమైన ప్రేమను అన్వేషిస్తూనే పలు రకాల బంధాలను పరిశీలిస్తాడు రచయిత. ఆ ప్రేమ దొరికింది అనుకున్నంతనే ఒక వైపరీత్యం మరో మలుపు తిప్పుతుంది.
వేదాంతం శ్రీపతిశర్మ గారి 'మధుగీతం' నన్ను కదిలించింది. ఆయన సన్నివేశాలు ఎంతో నాటకీయంగా ఉండి అనూహ్యమైన మలుపులు తిప్పుతాయి. సమకాలీనమైన సమాజంలోని కృత్రిమమైన వ్యవహారాలను ఆయన సహజమైన రీతిలో ప్రశ్నించిన తీరు అనితరసాధ్యం. కొన్ని సంవాదాలు పలు మార్లు గుర్తు చేసుకోవాలనిపిస్తాయి-ఆకెళ్ల శివప్రసాద్, writer in Telugu
శ్రీపతి గారిది విశిష్టమైన రచనాశైలి. హాస్యాన్ని పండిస్తూనే ఒక నిర్దిష్టమైన నిజాన్ని అన్వేషిస్తూ ఒక ఒరవడిని ప్రశ్నిస్తూ కవ్విస్తారు. ఒక్కో సంఘటన తరువాత ఒక సందేశం లాంటి స్టేట్మెంట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుటుంబ వ్యవస్థలు, ప్రేమ వ్యవహారాలు, ఇక్కట్లు, అంతరించిపోతున్న విలువలు ఒక ఆలోచింపజేసే ఇతివృత్తంలో మనకు ఈ నవలలో కనిపిస్తాయి. ఆకాశం కోసం వెతకటం ఒక ఆశ్చర్యకరమైన ప్రయోగం. అదే దారిలో పవిత్రమైన ప్రేమను కూడా అన్వేషించటం మరో ఆలోచింపజేసే ప్రల్రియ. రచయిత ప్రకృతిలోకీ, సంగీతంలోకీ, పదవిన్యాసంలోకీ తొంగి చూస్తూనే ప్రేమ తత్వాన్ని ఆవిష్కరించటం మధుగీతంలోని విశేషం.- కస్తూరి మురళీకృష్ణ, writer in Telugu
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners