Share this book with your friends

MADHUGEETAM / మధుగీతం

Author Name: VEDANTAM SRIPATISARMA | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

అనిర్వచనీయమైన ప్రేమను అన్వేషిస్తూనే పలు రకాల బంధాలను పరిశీలిస్తాడు రచయిత. ఆ ప్రేమ దొరికింది అనుకున్నంతనే ఒక వైపరీత్యం మరో మలుపు తిప్పుతుంది.

వేదాంతం శ్రీపతిశర్మ గారి 'మధుగీతం' నన్ను కదిలించింది. ఆయన సన్నివేశాలు ఎంతో నాటకీయంగా ఉండి అనూహ్యమైన మలుపులు తిప్పుతాయి. సమకాలీనమైన సమాజంలోని కృత్రిమమైన వ్యవహారాలను ఆయన సహజమైన రీతిలో ప్రశ్నించిన తీరు అనితరసాధ్యం. కొన్ని సంవాదాలు పలు మార్లు గుర్తు చేసుకోవాలనిపిస్తాయి-ఆకెళ్ల శివప్రసాద్, writer in Telugu

శ్రీపతి గారిది విశిష్టమైన రచనాశైలి. హాస్యాన్ని పండిస్తూనే ఒక నిర్దిష్టమైన నిజాన్ని అన్వేషిస్తూ ఒక ఒరవడిని ప్రశ్నిస్తూ కవ్విస్తారు. ఒక్కో సంఘటన తరువాత ఒక సందేశం లాంటి స్టేట్మెంట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. కుటుంబ వ్యవస్థలు, ప్రేమ వ్యవహారాలు, ఇక్కట్లు, అంతరించిపోతున్న విలువలు ఒక ఆలోచింపజేసే ఇతివృత్తంలో మనకు ఈ నవలలో కనిపిస్తాయి. ఆకాశం కోసం వెతకటం ఒక ఆశ్చర్యకరమైన ప్రయోగం. అదే దారిలో  పవిత్రమైన ప్రేమను కూడా అన్వేషించటం మరో ఆలోచింపజేసే ప్రల్రియ. రచయిత ప్రకృతిలోకీ, సంగీతంలోకీ, పదవిన్యాసంలోకీ తొంగి చూస్తూనే ప్రేమ తత్వాన్ని ఆవిష్కరించటం మధుగీతంలోని విశేషం.- కస్తూరి మురళీకృష్ణ, writer in Telugu

Read More...
Paperback

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Paperback 285

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

వేదాంతం శ్రీపతిశర్మ

వేదాంతం శ్రీపతిశర్మ తెలుగు, హిందీ, ఆంగ్లంలో రచనలు చేసారు. ఒక ఉన్నతమైన చలనచిత్ర విశ్లేషకులుగా పేరు గలవారు. వీరి పుస్తకం 'సదర్న్ గ్లోరీ' 34 దక్షిణాది చిత్రాల సమీక్షలుగా వెలువడింది. ఇది తెలుగులో కూడా అనువదింపబడింది. అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలలో ఆకాశవాణిలో తరచూ విశ్లేషణలు చేస్తూ ఉంటారు.  

 అంధ్రప్రభ, ఆంధ్రభూమి,స్వాతి, జాగృతి,నవ్య, సాక్షి , వార్త, చిత్ర వంటి పత్రికలలో పలు కథలు, నవలికలు, వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. కౌముది అను నెట్ పత్రికలో పలు రచనలు చేసి యున్నారు. ఈ నవల ఆంధ్రప్రభ అంతర్జాల పత్రికలో సీరియల్ గా వెలువడినది.

శ్రీపతి గారి హిందీ నాటికలు వైశిష్ట్యానికి చెందినవి. 'ఎక్ దిన్ బాజార్ మె' అనే నాటిక దక్షిణ మధ్య రెయిల్వే రాజభాషా పోటీలలో ప్రథమ బహుమతి పొందినది. 'సత్యమప్రియం' అనే హాస్యనాటిక ఆంధ్ర లలిత కళా సమితిలో ప్రథమ బహుమతి పొందినది. ఆకాశవాణి హైదరాబాదులో పలు ఆంగ్ల కథలు ప్రసారం చేసి యున్నారు.

ఆధ్యాత్మికపరమైన అంశాల మీద ప్రసంగిస్తూ ఉంటారు. వాల్మీకి రామాయణం పూర్తి 24000 శ్లోకాలతో గల వీరి ప్రసంగాలు 'అగ్రణి మీడియా' యూట్యూబ్ చానెల్ లో వినవచ్చు. వీరు జ్యోతిషశాస్త్ర నిపుణులు కూడా. 'ఆరోగ్యభాగ్యచక్రం' అనే పుస్తకం రచించి యున్నారు. హైదరాబాదులోని శ్రీ సత్యసాయి సెంటర్ (శివం) లో ఉగాది రోజున 'పంచాంగశ్రవణం' చేసియున్నారు.

Read More...

Achievements

+6 more
View All