‘వటవృక్షం ఒడిలో వన్నెల సీతాకోకచిలుక’ చదవదగ్గ ఒక మంచి రచన. మనం జీవన పోరాటంలో కోల్పోతున్న రోజువారీ చిన్న చిన్న ఆనందాలను మనకు గుర్తుచేస్తుంది ఈ పుస్తకం. పాత్రల ద్వారా అన్యాపదేశంగా ,సాధారణంగా సాగిన వివరణ చదువరులను ,వారిలో దాగివున్న సామర్ధ్యాన్ని చూసేటట్లుగా చేస్తుంది. తాము ఏమిటో,ప్రయత్నిస్తే తాము ఏమిసాధించగలము అనే విషయాల గురించిన ఆత్మపరిశీలనకు దారి తీసేదిగా వుంటుంది.ఎన్నో అసంపూర్ణమైన అంశాలు తనలో వున్నప్పటికి, అన్నింటిలో పరిపూర్ణురాలనే అన్నట్లుగా ,సాగిపోతూ నల