Share this book with your friends

Bharatha Prajalamagu Memu? / ‌భారత ప్రజలమగు మేము?

Author Name: Haribabu Eswarapragada | Format: Paperback | Genre : History & Politics | Other Details

భారతదేశంలో రాజ్యాంగం 1950లోనే ప్రక్క దారి పట్టింది. 1950లో లేదా 1952లో  నెహ్రూ రాష్ట్రపతిగా పోటీ చేసి దేశాన్ని రిపబ్లిక్ గా పరిపాలిస్తే రాజ్యాంగబద్ధంగా ఉండేది.  నెహ్రూ ఆ పని చేయక తను చెప్పినట్టు వినే  బాబు రాజేంద్రప్రసాదును అధ్యక్షుడిగా గెలిపించారు.  అదే తప్పు నేటికీ కొనసాగుతున్నది. రాజ్యాంగం ప్రకారం భారతదేశం అమెరికా వలే అధ్యక్ష ప్రజాస్వామ్యం. ఇంగ్లాండ్ వలె పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కాదు. భారతదేశంలో రాష్ట్రపతి ఒక్కడే ఎన్నికైన కార్యనిర్వాహక అధికారి. అతని ఎన్నికలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలని ఆర్టికల్ 55 తెలియజేస్తున్నది. అందువల్ల, ఈనాటి రాష్ట్రాలన్నీ రాజ్యాంగ విరుద్ధాలే. ప్రజాస్వామ్యంలో శాసనాలు తయారు చేయడం శాసన వ్యవస్థ పని; శాసనాల ప్రకారం దేశాన్ని పరిపాలించే బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థది. అనగా, కేంద్రంలో రాష్ట్రపతి ప్రభుత్వం, రాష్ట్రాలలో గవర్నర్ల ప్రభుత్వాలు ఉంటాయి. కార్యనిర్వాహక వ్యవస్థలో అత్యున్నతంగా రాష్ట్రపతి ఉండగా ఆయన అనుయాయులుగా కేంద్ర మంత్రులు, రాష్ట్రాలలో గవర్నర్లు, వారి క్రింద రాష్ట్ర మంత్రులు భాగం. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకున్నది కాబట్టి ఆయనకు కొన్ని శాసనసభలలోను పార్లమెంటు ఉభయ సభలలోను మెజారిటీ లేకపోవచ్చు. అది ఆయన అధికార విస్తృతికి విఘాతం కాదు. అమెరికాలోనూ అంతే. ఎన్నుకొనబడిన రాష్ట్రపతిని ప్రక్కన పెట్టి నియమితులైన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు పెత్తనం చేస్తున్నారు. ఇవి పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 48, 58, 91, 95, 112 మరియు 130 లో ఉన్నాయి తప్ప భారత రాజ్యాంగం ఆర్టికల్ 74,75, 163,164 లో లేవు. ఆ కారణంగానే దేశంలో రాజకీయ అస్థిరత, అవినీతి, అనిశ్చితి ఆవరించి ఉన్నాయి. 

Read More...
Paperback
Paperback 250

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

హరిబాబు ఈశ్వరప్రగడ

Author Bio. 

రచయిత తెలంగాణా హైకోర్టులో అడ్వొకేటుగా ప్రాక్టీసు చేస్తున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత, అనిశ్చితి, అవినీతి, తద్వారా ఉత్పన్నమైన సామజిక, ఆర్ధిక, రాజకీయ సంక్షోభాలకు స్పందించి, అంబేద్కరు మహాశయుడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికై రచించిన అతిపెద్ద రాజ్యాంగం ఉండగా ఇలా ఎలా జరుగుతున్నదని తెలుసుకోవడానికి భారత రాజ్యాంగంపై 3 సంవత్సరాలు విశేష పరిశోధన  చేసి ఈ గ్రంధం రచించారు. దేశంలో జరుగుతున్న రాజకీయ విధివిధానాలు కొంత బ్రిటిషు సంప్రదాయాల ప్రకారం, మరికొంత పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నాయితప్ప భారత రాజ్యాంగం ప్రకారం కాదని ఈ  గ్రంధంలో సహేతుకంగా వివరించారు.

Read More...

Achievements

+12 more
View All