Share this book with your friends

Sasaang (B/W) / శసాంగ్ Destiny's Tapestry / కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ…

Author Name: Anusree Mendu | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

మీరు మీ కళ్ళకు కట్టినట్లు ఊహించుకోటానికి సిద్ధంగా ఉన్నారా? శసాంగ్ - కనిపించని విధి అల్లిన ప్రణయ కద.

ఒక అసాధారణ ప్రపంచానికి స్వాగతం... 

ప్రాచీన భారతదేశ భూమి నుండి శశి అనే ఒక శాస్త్రీయ నృత్యకారిణి. తన ప్రతి కదలికతో వెన్నెల రాత్రుల యొక్క అద్భుతమైన చలదనాన్ని చూపిస్తుంది. . 

సాంగ్ యో భూగోళానికి అవతలి వైపున దక్షిణ కొరియాలో, ఈతరం సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తూ, సూర్యోదయపు పక్షుల పలకరింపు లాంటి తీయని స్వరముతో అద్భుతమైన గాత్రాన్ని మన ప్రపంచానికి అందిస్తున్నాడు. 

శశి, సాంగ్ యో వీరిరువురి కలయికే శసాంగ్ గా ఒక వినూత్నమైన కథనంతో మీ ముందుకు వచ్చింది. 

చైతు అనే ఒక అద్భుతమైన సంరక్షకుడు. చిక్కుముడితో కప్పబడి అద్భుత ప్రేమికుడిగా ఈ భూలోకంలో ఉన్న శక్తికి మించిన శక్తులు కలిగిన అమరజీవి. కాలక్రమేనా అల్లుకుపోయే ఒక అదృశ్య శక్తి. 

ఈఓణ్, శ్రావణ్ మధ్య మధ్యలో చేసే చిలిపి అల్లరులు, పాటకులకు ఉల్లాసాన్ని ఇస్తూ వారి లాంటి స్నేహితుల కోసం ఆరాటపడేలా చేస్తుంది. 

కాల్విణ్ రాకతో కథనం ఊహించని మలుపు తిరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న సాగరంలో తుఫాను తాకని తీరం ఉండదు కదా? ప్రేమ ద్వేషం మధ్యలో చీకటి వెలుగుల కలయిల, పాత్రలు ఒకదానికొకటి ముడి వేసుకుంటూ అల్లిన అల్లిక లాగా ఈ కథ సాగుతుంది. ఈ పోటీ ప్రపంచంలో మన ఇండియా అంటే ఇప్పటికీ పేద దేశమే అనే ఆలోచిస్తున్న వారికి, ఇండియా యొక్క గొప్పతనాన్ని భారత స్త్రీల గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఉద్దేశంతో, భార్యాభర్తల మధ్య అనుబంధం చిన్నచిన్న తుఫానులకి కొట్టుకుపోయేదేలాగా కాకుండా, ఎలాంటి సునామీలు వచ్చినా తట్టుకునేది లాగా ఉండేటటువంటి బలమైన వివాహ వ్యవస్థ మనది. ఈ తరం వారు కూడా ఆ గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఈ చిన్న ప్రయత్నం. ఈ అసాధారణ ప్రపంచంలో విహరించాలని రాబోవు ప్రయాణానికి కూడా మీరు సహకారం అందిస్తారని ఆశతో నా మొదటి ప్రయత్నం. మన తెలుగు జాతిలోని, తెలుగు భాషలోని కమ్మదనాన్ని గుర్తుచేస్తూ అక్కడక్కడ వచ్చే సాహిత్యంలోని సరసాలను పొడుపు కథలలోని సరదాలను చూసి మీరు మురిసిపోవాలని ఆశిస్తున్నాను. నా ఈ మొదటి ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని కోరుతూ ఆశిస్తూ…

Read More...
Paperback
Paperback 699

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

అనుశ్రీ మెండు

అనుశ్రీ మెండు

Read More...

Achievements

+1 more
View All