Share this book with your friends

Vaastu Sashtra Vignana Sarvasvamu / వాస్తు శాస్త్ర విజ్ఞ్యాన సర్వస్వము

Author Name: Kotipalli Subbarao | Format: Paperback | Genre : Arts, Photography & Design | Other Details

ఇది మీకు తెలుసా ? మీరు నివసించే ఇల్లు (స్వంత లేక అద్దెదైనా) మీ బాగోగులను చెబుతుంది. ఇల్లు బాగోలేకపోతే, మీ జాతకం బాగున్నా, ఇంట్లో ఉన్న వాస్తు  అంశాల ప్రకారం మీ భవిష్యత్తు నడుస్తుంది. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన గృహాల్లో నివసించేవారు తప్పనిసరిగా సత్ఫలితాలను పొందుతూ సర్వతోముఖాభివృధి సాధిస్తారు. వాస్తుకు విరుద్ధంగా నిర్మించిన గృహాలు, ఫ్లాట్లలో ఉన్నవారు , పలు కష్టాలను, దుష్ఫలితాలను పొందడం జరుగుతుంది. జాతకాదులను ప్రక్కకు పెడితే , వాస్తు శాస్త్ర బద్ధంగా ఉన్న గృహం లేక  ఫ్లాట్లలో నివసించే వారు వాస్తుకు విరుద్ధంగా ఉన్న గృహంలోని వారికంటే, అధిక సుఖ సంతోష, సంపదలతో జీవిస్తారు.  వాస్తు శాస్త్ర బద్ధంగా  ఉన్న గృహంలో నివసిస్తున్నవారికి జాతకరీత్యా చెడుఫలితాలు కలుగవలసివున్నా, అవి చాలా తక్కువ స్థాయిలో మాత్రమే బాధిస్తాయి. ఈ గ్రంథ రచయిత శ్రీ సుబ్బారావు దేశవిదేశాల యందు గృహాలను పరిశీలించి, అచ్చటి దోషాలను సరిచేయించి, ఎంతో మంది జీవితాల్లో సుఖ సంతోషాలను పెంపొందింపజేశారు. ఈ గ్రంధంలోని 18 అధ్యాయాలలో వాస్తు స్వరూప స్వభావాలు, గృహనిర్మాణావశ్యకత   - ప్రయోజనాలు, భూపరీక్షాక్రమము , భూమి , రోడ్ల ఎత్తు పల్లాలు , అష్టదిశలయందు నివసించేవారి గుణగణాలు, ఆయాదిశల విశిష్టతలు, గృహనిర్మాణ మందలి మెలకువలు, సింహద్వారాలు, కిటికీలు, మెట్లు, నైసర్గిక వాస్తు, నేలమాళిగలు - ప్రభావాలు , వంటగది, గృహనిర్మాణ  దోషాలు - నివారణోపాయాలు, వాపి, కూప తటాకాదులు, వీధి శూలలు, మూలలు మూత పడడం, 105 వేధాదోషాలు, అమెరికాయందలి వాస్తు,  వాస్తుపురుషుడు, ఫెంగ్ షూయి ( చైనా వాస్తు), గృహంలో ఎదురయ్యే సమస్యలు-  నివారణోపయాలు, శంకుస్థాపన, గృహారంభ, గృహప్రవేశ ముహుర్తాలు, భూమిలో ఉండే శల్యాలు - దోషాలు, ఆయం, వాస్తుపదాలు మొదలగునవి  వివరించబడ్డాయి. ప్రజల దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకొని, అభివృద్ధి పధంలో సుఖమయ, ఆనందకరమైన జీవితాన్ని గడుపుటకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.

Read More...
Paperback
Paperback 600

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

కోటిపల్లి సుబ్బారావు

ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, సిద్ధాంతం గ్రామస్థులగు కోటిపల్లి సుబ్బారావు, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి  బ్యాంకు (నాబార్డ్) నందు  వివిధ హోదాలలో హైదరాబాద్, ముంబై , ఢిల్లీ , బెంగుళూరులలో పని చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ గా 2010 లో పదవి విరమణ చేసారు. ప్రాధమికంగా సైన్సు  పట్టభద్రుడైనప్పటికి , తరువాత కాలంలో జ్యోతిషంలో మాస్టర్సు డిగ్రీ పొందారు. ఒక వ్యక్తి నివసించే ఇల్లు, అతని ఆరోగ్య సంపదలను, అదృష్టాన్ని సూచిస్తుందని తెలిసిన తరువాత, ఆ విషయాలను ప్రజలకు తెలియజేసి వారి అదృష్టాలను పెంచాలనే తపనే ఈ వాస్తు శాస్త్ర విజ్ఞాన  సర్వస్వమనే గ్రంధానికి ప్రేరణ. దేశవిదేశాలయందు పలువురి ఇళ్లను పరిశీలించి, గుణదోషాలను  సూచించి వారి వారి అదృష్ట, సంపదల పెరుగుదలకు దోహదపడ్డారు. పరోపకారం ఇదం శరీరమనే నానుడికనుగుణంగా, ఉచితంగా ఇళ్లను పరిశీలించి గుణదోషాలను తెలియజేస్తారు. కలలు  కూడ సమీప భవిష్యత్తుని తెలుపుతాయని వీరు కలలు - వాటి ఫలితాలను  "స్వప్నఫలశాస్త్రము " అనే గ్రంధంగా  రచించి ప్రచురించారు.వీరికి చరిత్రయందు కూడ ప్రవేశమున్నది. ఈ మధ్యనే ఒక చరిత్రకెక్కని  స్వాతంత్య్ర  సమరయోధుడి గాధను (1860 - 1891) “చరిత్ర విస్మరించిన  స్వాతంత్య్ర సమరయోధుడు ద్వారబంధాల చంద్రయ్యదొర" అనే పుస్తకాన్ని  రచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందిన తరువాత డిసెంబర్ 2019 లో తెలుగు భాషాభివృద్ధి, పరిరక్షణ మరియు తెలుగు భాషా  వ్యాప్తికి "ప్రపంచ తెలుగు భాషా పరిరక్షణ పార్టీ" అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈయన వారి శ్రీమతి మణి  గారితో హైదరాబాద్ నందు నివసిస్తున్నారు.

Read More...

Achievements

+3 more
View All