Share this book with your friends

Women and Sabarimala / మహిళలు మరియు శబరిమల The Science behind Restrictions/నిబంధనల శాస్త్రీయ వివరణ

Author Name: Sinu Joseph | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

పునరుత్పత్తి వయస్సులో ఉన్న స్త్రీలను శబరిమలలోకి ఎందుకు అనుమతించరు? అని అడిగిన వారందరికీ ఈ పుస్తకం ఒక సమాధానం. ఈ పుస్తకం శబరిమల ఆలయంలో మహిళలపై ఆంక్షల వెనుక ఉన్న శాస్త్రీయతను, మునుపెన్నడూ చర్చించని దృక్పథాన్ని అందిస్తుంది. శబరిమలకి సంబంధించిన ఐదు దేవాలయాల సందర్శన ఆమె శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో నమోదు చేసిన రచయిత, వారి ప్రత్యక్ష అనుభవాన్ని ఈ పుస్తకంలో అందించారు. ఆయుర్వేదం, చక్రాలు, తంత్రం మరియు ఆగమ శాస్త్రం వంటి భారతదేశ సాంప్రదాయ విజ్ఞాన శాస్త్ర-సంబంధిత ఆధారాల ద్వారా ఆలయ స్వభావాన్ని వివరిస్తూ, స్త్రీ దృక్కోణం నుండి శబరిమల గురించి రచించబడిన అరుదైన పుస్తకం ఇది. అదే సమయంలో, రచయిత యొక్క వ్యక్తిగత అనుభవాలు ఈ లోతైన శాస్త్రాల అవగాహనను సులభతరం చేస్తాయి. ఈ పుస్తకం శబరిమల వంటి దేవాలయాలు మానవ శరీరధర్మాన్ని, ముఖ్యంగా స్త్రీల ఋతుచక్రాలను ఎలా ప్రభావితం చేస్తాయో పాఠకులకు ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఈ పుస్తకం హిందూ దేవాలయాల పట్ల, ముఖ్యంగా శబరిమల పట్ల ఉన్న అవగాహనను  మారుస్తుంది.

Read More...
Paperback
Paperback 150

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

సిను జోసెఫ్

సిను జోసెఫ్ 'మైత్రీ స్పీక్స్ ట్రస్ట్' సహ-వ్యవస్థాపకురాలు మరియు మేనేజింగ్ ట్రస్టీ. ఆమె 2009 నుండి ఋతుస్రావ మరియు పునరుత్పత్తి ఆరోగ్య రంగాలలో విస్తృతమైన క్రియాశీలక పరిశోధనలు చేసారు. వారు భారతదేశం అంతటా పర్యటించి,  20,000 కంటే ఎక్కువ మంది మహిళలు మరియు యుక్తవయస్సులో ఉన్న బాలికలతో ముఖాముఖి సంభాషించి, వారు ఆచరించే  ఋతుక్రమ పద్ధతులు మరియు స్త్రీల ఆరోగ్యంపై వాటి ప్రభావం గురించిన సమాచారాన్ని సేకరించారు. ఋతుక్రమ ఉత్పత్తుల ప్రచారంపై దృష్టి సారించే కథనాలను పక్కన పెడుతూ, ఋతుస్రావానికి సంబంధించిన  స్థానిక పద్ధతులు మరియు ఆచారాలను ఆమె అన్వేషించారు. ‘ఋతు విద్య’ అన్న వారి పుస్తకం ద్వారా స్థానిక అభ్యాసాల వెనుక ఉన్న శాస్త్ర విజ్ఞానాన్ని వెలికితీసి, ఋతుక్రమం యొక్క భారతీయ దృక్పథం అనే ప్రత్యేకమైన కథనాన్ని ఆవిష్కరించారు. ఆమె అనేక హిందూ దేవాలయాలు, ఋతుక్రమ నిబంధనలు మరియు స్త్రీల ఋతుక్రమ ఆరోగ్యంపై వాటి ప్రభావాన్ని అధ్యయనం చేసారు. శబరిమల మరియు సంబంధిత శాస్తా దేవాలయాలు, మరీ  ముఖ్యంగా, ఆ ప్రదేశాలు స్త్రీల ఋతుచక్రాలను మార్చే విధానం అనే అంశం పై ప్రత్యేక దృష్టితో,  ఆమె అధ్యయనం చేసారు. 

Read More...

Achievements

+19 more
View All