Share this book with your friends

Paalavelli / పాలవెల్లి

Author Name: Uday Arumilli | Format: Paperback | Genre : Literature & Fiction | Other Details

మేనల్లుడి కోసం ఉన్న ఒక ఎకరాన్ని అమ్మేసిన మేనమామ కథ. యావత్ ప్రపంచం చేత కీర్తించబడ్డ ఒక తెలుగింటి ఆడపడుచుని “దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా?” అంటే, ఆమె “ఉన్నాడు” అని నిరూపించిన కథ. తండ్రి కోసం తపస్సు చేసిన ఒక కొడుకు కథ. ఖారాగార శిక్ష పడిన ఒక మావోయిస్టు కథ. ఐ.ఐ.టి లో చదువు, అమెరికా లో కొలువు, ఆ కూతురు కోరిన చిత్రమైన కోరికని ఆమె తల్లితండ్రులు ఒప్పుకున్నారా? ప్రాణమిత్రులు, అక్కాచెల్లెళ్ళు, భగవంతుడూ-భక్తులు, తండ్రీకూతుళ్లు, భార్యాభర్తలు, బావామరదళ్ళు, ప్రేమజంటలు, గురుశిష్యులు, తండ్రీకొడుకులు, మామాకోడళ్ళు, ఇలా అల్లిన ప్రతీ కథ కి, మూలాన్ని మాత్రం దైవం అనే దారం తో ముడివేసి, పాఠక దేవుళ్ళ కోసం కట్టిన పదకొండు కథల “పాలవెల్లి”.

Read More...
Paperback
Paperback 295

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

ఉదయ్ ఆరుమిల్లి

ఉదయ్ ఆరుమిల్లి, పుట్టి పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లాలో, వెంటూరు అనే చిన్న గ్రామం. అందుకే, మాటల్లో కొంచెం వెటకారం పాళ్ళు ఎక్కువగానే ఉంటాయి, అది చూసి తప్పుగా అనుకునేరు, అది గోదారోళ్ల ఆచారం అండీ బాబు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుని, సాఫ్ట్-వేర్ ఇంజనీర్ పేరుచెప్పి, గత పదేళ్లుగా కంప్యూటర్ తో కుస్తీపడుతున్నాడు. “తెలుగు భాష”, “తిరుపతి లడ్డు”, “శాకాంబరీ దేవి ప్రసాదం” (అదేనండి గోంగూర), “మధ్యతరగతి మనస్తత్వం”, “చలన చిత్రం” ఇవే ఆయన పంచ ప్రాణాలు. 2019 లో, “షావుకారు” తో మొదటిసారి తెలుగు రచయితగా పరిచయం అయ్యాడు. ఈసారి, పాఠక దేవుళ్ళ కోసం 11 కథలతో పాలవెల్లి కట్టాడు.

Read More...

Achievements

+13 more
View All