You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
Discover and read thousands of books from independent authors across India
Visit the bookstore"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palఒక వైద్యుడి జీవిత విశేషాలు కాదు, నూరేళ్ల తెలుగు చరిత్రకు ప్రతిబింబం డాక్టర్ శ్యామా ప్రసాద్ పిలిగం జీవిత చరిత్రగా వెలువడిన ఈ పుస్తకం దాదాపు నూరేళ్ల తెలుగు చరిత్రకు అద్దంపడుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్యశాస్త్రాల విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్యామా ప్రసాద్, ఆయన తండ్రి డాక్టర్ పి.సుందరయ్యగారి జీవితవిశేషాలు మాత్రమే ఉంటాయనుకున్న గ్రంథంలో తెలుగునాట చెరగని ముద్రవేవసిన ఎన్నెన్నో రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిణామాలను కళ్లకుకట్టారు రచయిత అరవింద్ యాదవ్. ఆధునిక ప్రపంచాన్ని కుదిపేసిన రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో పుట్టారు డాక్టర్ సుందరయ్య. డాక్టర్‌గా కొన్ని వేల మందికే తెలిసిన ఆయన రాజకీయ విశ్వాసాలు, ఆచరణ వంటి విశేషాలతోపాటు నెల్లూరు జిల్లా నుంచి నాటి మద్రాసు మహానగరానికి, అక్కడి నుంచి వృత్తిలో భాగంగా ఉత్తరాంధ్ర నగరం విశాఖపట్నం వరకూ సాగిన ఆయన ప్రయాణం పాఠకులకు సమకాలీన విషయాల అవగాహనకు ఉపకరిస్తుంది.
డా. అరవింద్ యాదవ్
డాక్టర్ అరవింద్ యాదవ్... జర్నలిస్టుగా ఇరవై ఐదేళ్ళ సుదీర్ఘ అనుభవం ఆయనది. పాత్రికేయుడిగా ఆయన చాలా సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. ఆయన తన అనుభవాలన్నింటినీ రంగరించి అద్భుతమైన రచనలు, ప్రసంగాలుగా మలిచారు. సమాజంలో అట్టడగు వర్గాలకు జరుగుతున్న అన్యాయం, అవినీతి, దౌర్జన్యం, బానిసత్వానికి వ్యతిరేకంగా తన రచనల ద్వారా పోరాటం సాగిస్తున్నారు. తన కలాన్ని సమాజంలో “ అణగారిన వర్గాల గొంతు” గా వినిపిస్తున్నారు. ఇదే జర్నలిజం ప్రపంచంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. కొన్నేళ్ళుగా సమాజంలో నిర్మాణాత్మకమైన మార్పు కోసం నిర్విరామంగా పనిచేస్తున్న ఈ సమాజపు అచీవర్స్ గురించి, వారి విశేష కృషి గురించి రాయడం, వాటిని డాక్యుమెంట్ చేయడంపై అరవింద్ యాదవ్ ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాదులో పుట్టి పెరిగిన డాక్టర్ యాదవ్ విద్యాభ్యాసమంతా నగరంలోనే సాగింది. ఆయన సైన్స్, సైకాలజీ, న్యాయ శాస్త్రాలను అభ్యసించారు. దక్షిణాది రాజకీయాలు, సంస్కృతి, సంప్రదాయాలపై ఆయనకు అపారమైన పరిజ్ఞానం ఉంది. వార్తలు, ప్రత్యేక కథనాల సేకరించే పనిలో భాగంగా ఆయన దక్షిణాది రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అనేక మారుమూల గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల జీవన స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు ప్రపంచానికి తెలియచేసే వారు. ఆయన అన్వేషణ, సుదీర్ఘ ప్రయాణాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కథారచయితగా, జీవిత చరిత్ర రచయితగా కూడా పేరు తెచ్చుకుంటున్నారు. సమాజ నిర్మాణంలో భాగస్వాములై.... సమాజ నిర్మాణంలో భాగస్వాములై.... తమ కృషి ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఎంతో మంది విజేతల విజయ రహస్యాలను, వారి జీవితంలోని వివిధ కోణాలను ఆవిష్కరించి, లక్ష్యసాధన దిశగా ప్రజలను చైతన్య పరచడమే తన ప్రథమ ప్రాధాన్యతగా ఆయన పెట్టుకున్నారు. అరవింద్ యాదవ్ భారతదేశం అంతటా వివిధ రంగాలకు చెందిన అనేక మంది విశిష్టమైన వ్యక్తుల జీవితాలను డాక్యుమెంట్ చేశారు. 'భారతరత్న' డాక్టర్ సిఎన్ఆర్ రావు, భారతదేశపు మొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ పద్మావతి, సామాజిక కార్యకర్త ఫూల్ బాసన్ యాదవ్ తో పాటు ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రలను మనకు అందించారు. డా. యాదవ్ ఇప్పటి వరకు 20 కి పైగా పుస్తకాలు, అనేక వ్యాసాలు రాశారు. జర్నలిస్టుగా 1999 నుండి 2019 వరకు డాక్టర్ యాదవ్ దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను కవర్ చేశారు. ఆజ్ తక్/హెడ్ లైన్స్ టుడే, IBN7, TV9 న్యూస్ నెట్ వర్క్ వంటి ప్రముఖ సంస్థలలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు. భారతదేశపు మొదటి HD న్యూస్ ఛానెల్ - సాక్షి టీవీని స్థాపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. యువర్ స్టోరీ వెబ్ సైట్లో భారతీయ భాషలన్నింటికీ మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఎంతో మంది జర్నలిజం రంగంలోకి ప్రవేశిస్తారు, కానీ డాక్టర్ అరవింద్ యాదవ్ వంటి వారు మాత్రమే తమ విశేషమైన కృషితో ఆ రంగానికి వన్నె తెస్తారు. సామాజిక, రాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలలో నిమగ్నమై ఉండటమే కాకుండా సామాజిక న్యాయం, పత్రికా స్వేచ్చ కోసం ఆయన అహర్నిశలు పోరాడుతూనే ఉన్నారు.
హిందీ సాహిత్య విమర్శలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. "నిర్మాణాత్మకమైన విమర్శ" ఆయన సహజ లక్షణం. ఆయన విమర్శించే తీరు సంఘం తీరును కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. హిందీ విమర్శ మౌఖిక సంప్రదాయాన్ని ఆయన ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. క్షణం కూడా తీరిక ఉండని జర్నలిజం, మీడియా రంగాలలో ఉంటూనే తనకు ఇష్టమైన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫిని, పర్యాటక ఆసక్తిని ఆయన ఎన్నడూ వీడలేదు.
The items in your Cart will be deleted, click ok to proceed.