Share this book with your friends

The Resurrection Glory of Jesus - Its impact / యేసు పునరుత్ధాన మహిమ - ప్రభావము

Author Name: Bhimjeeram Polumati | Format: Paperback | Genre : Religion & Spirituality | Other Details

దయగల దేవుడు ప్రేమ గల తండ్రి తన కృపతో  లోకానికి తన్ను తాను తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచుకొనుట గొప్ప అనుగ్రహము.  నశించు పోతున్న సమస్త జనులకు రక్షణ కలిగించుట ఆయన ప్రణాళిక. మనస్సు యొక్కయు శరీరము యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచూ స్వభావసిద్దముగా దేవుని తీర్పులో యున్న మానవుడు నశించుపోవుట దేవుని చిత్తముగాదు.రాబోవు యుగములలో తన బిడ్డలు తనఎదుట పరిశుద్దులుగాను నిర్దోషులునుగాను యుండవలెనని క్రీస్తు యేసు ద్వారా మార్గము సిద్దపరచుట పరిశుద్దుడైన మన దేవుని సంకల్పము. లోకమంతయు దేవుని దృష్టిలో మృతమైయుండగా అట్టిస్థితినుండి మానవుడు బయట పడుటకు ప్రేమ, దయ జాలి కృప కలిగిన దేవుడు మానవుని తిరిగి రక్షించి తన దగ్గరకు చేర్చుకొనుటకు రచించిన ప్రణాళికే యేసుక్రీస్తు సిలువ యజ్నము.

దేవుడు సంకల్పించిన ప్రణాలిక తన ప్రియకుమారుని ద్వారా నెరవేర్చిన సిలువ యజ్నం వృదా కాలేదు.ప్రపంచ వ్యాప్తంగా మంచి పలితాలనే ఇస్తుంది. కోట్ల కొలది ప్రజలు రక్షణ పొంది దేవుని నిత్య రాజ్యానికి వారసులయ్యారు. అవుతున్నారు. ఇంకా అనేకమంది కావలసియుంది. ఈలోకం శాశ్వతం కాదని, ఈలోకంలో మనము కేవలం యాత్రికులమేనని, గొప్ప గొప్ప సామ్రాజ్యలను స్థాపించిన చక్రవర్తులు కూడా ఈలోకములో నుండి కనుమరుగైనారని, వారు సంపాదించిన ఆస్తులు రాజ్యాలు అన్యాక్రాంతము జరిగినాయని గ్రహించి మరణానంతరము కూడా మనకు వేరే లోకము ఒకటి ఉందని అది దేవుని నిత్య రాజ్యమైనా గావచ్చు లేక నిత్యాగ్నికావచ్చు అని గ్రహించి యేసుక్రీస్తు చూపే మార్గము దేవుని నిత్యరాజ్యానికి వారసులునుగా చేయగలిగే మార్గముగా భావించి  దానిని  ఇతరులకు తెలియజెప్పడమే ఈ చిన్ని ప్రయత్నముగా  రచయిత ఉద్దేశము.

Read More...
Paperback
Paperback 299

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

పోలుమాటి భీమ్ జీ రామ్

పోలుమాటి భీమ్ జీ రామ్ గారు, ఆంధ్రప్రదేశ్, తణుకు పట్టణ సమీప గ్రామములో జన్మించి, ఉన్నత విద్యను అభ్యశించి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగి గా పనిచేసి పదవీ విరమణ అనంతరం, హోలీ స్పిరిట్ క్రిస్టియన్ యూనివర్శిటీ (HSCU) నుండి మాస్టర్స్ డిగ్రీ మరియు డాక్టరేట్‌ను పొంది క్రీస్తు ఏసు యొక్క జననం, జీవనశైలి, మరణం మరియు పునరుత్ధాన మహిమలను గురించి పుస్తకాలు వ్రాయడము జరిగింది. ప్రస్తుతం, ఈయన తన కుటుంబంతో నివసిస్తూ హైదరాబాద్‌లోని ఒరాకిల్స్ ఆఫ్ గాడ్ ఫౌండేషన్‌న అనెే సంస్థను నడుపుతూ క్రీస్తు సేవలో కొనసాగుతున్నారు.

రచయిత, క్రైస్తవ విశ్వాసంపై విస్తృతంగా వివరణాత్మకంగా వ్రాసిన  పుస్తకాలు మరియు బైబిల్ బోధనల ద్వారా అనేకులు దేవుని యందు విశ్వాసంలో బలపడుతూ మరియు దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలుగుతున్నారు. దేవునికే సకల మహిమ కలుగును గాక ఆమెన్.

రచయిత గురించి మరింత తెలుసుకోవడానికి పుస్తకాల కోసం దయచేసి సెల్‌ఫోన్ నంబర్‌: +91 7382462059 లో సంప్రదించండి. దేవుని దయ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక  ఆమెన్.

Read More...

Achievements